Sunday, 17 May 2015

నిత్య పూజ విధి

ఓమ్
పూజ అంటే అర్చన అని అర్థం. “జ” అంటే పుట్టడము అని అర్థం ఉంది. పవిత్రమైన జన్మము అనే భావనగా కూడా చెప్పుకోవచ్చు. పూజ అంటే ఏదైనా ఒక విశేషమైన అంశమును స్ఫురణకు తెచుకొని దానినే మననం చేయడం అని అర్థం. మననం చేస్తే మళ్లి జన్మించినట్టే అనే భావన ఉంది.

భౌతికంగా మనం చేసేటువంటి పూజ ఏకొపచారం, పంచోపచారం, షోడశోపచారం, అష్ట చత్వారింశత్ ఉపచారం, చతు శత్వారింశత్ ఉపచారం, మహా పూజ అనేకములుగా చెప్పబడి ఉన్నాయి.

ఏదైనా ఒక విగ్రహమును (చిహ్నమును) మనకు ప్రతీకగా ఎదుట నిలుపుకొని, దానిపై మనస్సు  లగ్నం చేసి, వస్తు ద్రవ్యముల చేత అర్చించి, స్తోత్రం చేసి, ధ్యానం చేసి శక్తి వంతం చేయడమే పూజ. ఇక్కడ మనము మన మనస్సుని ఎదుట ఉన్న భగవంతుని ప్రతిమ లో భావోపితం చేసి - “ఆత్మానం ప్రత్యారాదయేత్” అని బోధాయన మహర్షి చెప్పినట్టుగా - ఆత్మకు ప్రతీకగా ఈ ఈశ్వరుడిని, ఈ విగ్రహమును ఆరాధన చేస్తున్నాను

నిజమైన పూజ అంటే మన మనస్సును భగవంతుని పైన లగ్నం చేసి శక్తివంతం కావడమే. మానసికమైన అనుబంధం పెంచుకోవడమే నిజమైన పూజ

నిత్యపూజ కు కావలసిన వస్తువులు
పసుపు దీపం వత్తులు పంచ పాత్ర కర్పూరం
కుంకుమ అక్షతలు పళ్ళెం (2)
గంధము పూలు ఉద్దరిణి
అగరవత్తులు ఆవు నేయి/నువ్వుల నూనె కలశం చెంబు
దీపం కుందులు అరటి పండ్లు ఘంట

నిత్య పూజ నియమములు
  1. పూజ ఇంటి యజమాని చేయవలసి ఉంటుంది.
  2. మడి వస్త్రములు (పంచె, కండువా) ధరించాలి . పూజ అయిన తర్వాత వీటిని రోజు కట్టుకొనే వస్త్రములకు దూరంగా ఉంచాలి
  3. తూర్పు లేదా ఉత్తరం దిశగా ఆసనం ఫై కూర్చోవాలి
  4. ఈశ్వరునికి తులసి దళం తో పూజ పనికి రాదు. విష్ణు మూర్తి కి తులసి దళం వాడవచ్చు
  5. భిన్నమైన (విరిగి పోయిన) విగ్రహ ప్రతిమలు పూజ కి పనికి రావు
  6. దేవుడికి సమర్పించే అర్ఘ్య పాద్యములు వదలడానికి వేరే పళ్ళెం వాడాలి. మీరు ఆచమనీయం కి వాడిన పళ్ళెం వాడకూడదు
  7. గృహం లో సాలగ్రామాలు ఉంటే నైవేద్యం తప్పనిసరి. అభిషేకం చేయలేని పక్షం లో కనీసం నీటి లో మునిగేట్లుగా ఉంచి నైవేద్యం ఉంచాలి
  8. నేల మీద పడిన పూలు మరియు వాసన చుసిన పూలు పూజ కి పనికి రావు
  9. పూజ చేసిన తర్వాత జలము ను తులసి చెట్టుకు పోయడం నిషిద్ధం
నిత్య పూజ విధి
శ్లో॥ ఓం గణానాంత్వా గణపతి గ్o హవామహే కవిం కవీనా ముపశ్రవ వస్తవం
జ్యేష్ట రాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పద ఆనహ్ శృణ్వన్నూతిభి: సీద సాదనం
॥ శ్రీ మహా గణపతయే నమః ॥

శ్లో॥ ప్రణో దేవీ సరస్వతి వాణీ భిర్వాజినీ వతి
దీనాయ విత్రియ వతు ॥ శ్రీ సరస్వత్యై నమః ॥  

శ్లో॥ మాతా పితృ సమం దైవం, న దైవం పితృ మర్చయేత్
సర్వ తీర్థ ఫలం జ్ఞేయం మాతా వందన తత్సదా
॥ మాతృ దేవో భవ, పితృ దేవో భవ॥

శ్లో॥ గురూనాం అగ్రజం శ్రేష్ఠం, గురు పాదం స్మరం హరిం
గురూనాం అర్చయేన్నిత్యం తస్మైశ్రీ గురవే నమః
॥ ఆచార్య దేవో భవ ॥

శ్లో॥ వేద శాస్త్రాని నిద్యుక్తం, దేవతార్చన హోమచ
షట్కర్మ ఉదయాన్నిత్యం బ్రాహ్మణయ్: వందనయ్ స్సదా
॥ అతిథి దేవో భవ ॥

ప్రతి దేవుని (దేవత) పూజకు ముందుగా గణపతి పూజ చేసి అనంతరం మీరు ఏ దేవుని పూజిస్తారో ఆ దేవుని పూజించవలెను

గణపతి శ్లోకం॥
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం         
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాన్తయే ॥         
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం         
అనేక దన్తం భక్తానాం యేకదన్త ముపాస్మహే ॥

ఏకహారతి వెలిగించాలి:
(ఏకహారతి వెలిగించి దానికి పసుపు, కుంకుమ, అక్షంతలు & పూల తో అలంకరించవలెను.)

యీ క్రింది మంత్రమును చెప్పుతూ దీపమును ఏకాహారతి తోటి దీపం వెలిగించాలి
దీపారాధన:
శ్లో॥ దీప జ్యోతి పరబ్రహ్మ, దీపో జ్యోతి జనార్ధన
దీపో హరతుమే పాపం, దీప జ్యోతిర్నమోస్తుతే॥


శ్లో॥ భోదీపదేవి రూపస్త్యం, కర్మసాక్షి హ్యామిఘ్నకృత్‌
యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదో భవ ॥

దీపారాధన ముహూర్తస్తు సుముహూర్తోస్తు॥
(దీపం వెలిగించి దీపం దగ్గర పూలు, పసుపు, కుంకుమ మరియు అక్షతలు ఉంచాలి)


ఘంటానాదం
(ఈ క్రింది మంత్రం చెప్తూ ఘంట మ్రోగించాలి)
శ్లో॥ ఆగమార్తాంతు దేవానం గమనార్తంతు రాక్షసాం
కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంచనం ॥

శరీర శుద్ధి
(ఈ క్రింది మంత్రం చెప్తూ శిరస్సు పై నీళ్ళు చల్లుకోవలెను )
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం” గతో‌உపివా | యః స్మరేత్
స బాహ్యాభ్యంతర శ్శుచిః ||  పుండరీకాక్ష | పుండరీకాక్ష | పుండరీకాక్షాయ నమః |


ఆచమనం
(చెయ్యి అలివేణి (ప్లేటు)లో కడుగుకోవాలి)
1. ఓం కేశవాయ స్వాహా (అని తీర్ధం తీసుకోవాలి)
2. ఓం నారాయణాయ స్వాహా (అని తీర్ధం తీసుకోవాలి)
3. ఓం మాధవాయ స్వాహా (అని తీర్ధం తీసుకోవాలి)
4. ఓం గోవిందాయ నమః  (మళ్లీ చెయ్యి కడుగుకోవాలి)
తదుపరి నమఃస్కారం చేయుచు యీ మంత్రములను పఠించవలెను
5. ఓం విష్ణవే నమః  6. ఓం మధుసూదనాయ నమః
7. ఓం త్రివిక్రమాయ నమః  8. ఓం వామనాయ నమః  9. ఓం శ్రీధరాయ నమః
10. ఓం హృషీకేశాయ నమః 11. ఓం పద్మనాభాయ నమః 12. ఓం దామోదరాయ నమః   
13. ఓం సంకర్షణాయ నమః  14. ఓం వాసుదేవాయ నమః  15. ఓం ప్రద్యు మ్నాయ నమః  
16. ఓం అనిరుద్ధాయ నమః  17. ఓం పురుషోత్తమాయ నమః  18. ఓం అధోక్షజాయ నమః  
19. ఓం నారసింహాయ నమః  20. ఓం అచ్యుతాయ నమః  21. ఓం జనార్ధనాయ నమః  
22. ఓం ఉపేంద్రాయ నమః  23. ఓం హరయే నమః 24. ఓం శ్రీ కృష్ణాయ నమః

దైవ ప్రార్థన
శ్లో॥   యశివ్వో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళా
తయో స్సం స్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళమ్   

శ్లో॥   లాభ స్తేషాం జయ స్తేషాం కుతస్తేషాం పరాభవః
యోశామిందీ వరశ్యామో హ్రుదయస్థో జనార్దనః

శ్లో॥   ఆపదామ హర్తారం దాతారం సర్వ సంపదాం  

లోకాభి రామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్

శ్లో॥   సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే

ఈ క్రింది మంత్రమును చెపుతూ కుడి చేతితో అక్షంతలు దేవునిపై చల్లవలెను
శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః
వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః
అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః మాతా పితృభ్యాం నమః
శ్రీ సీతారామాభ్యాం నమః
సర్వేభ్యో మహాజనేభ్య నమః

అయం ముహూర్తస్సుముహోర్తస్తు


భూతోచ్చాటన
ఉతిష్టంతు భూత పిశాచాః  - యు ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరో ధేనా బ్రహ్మ కర్మ సమారభే ॥
(అక్షతలు వాసన చూసి ఎడమ వైపు పడ వేయాలి)

ప్రాణామాయం
ఓం భూ:, ఓం భువః, ఓం సువః
ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్o సత్యమ్

ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్ ॥
ఓ మాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోమ్ ॥


సంకల్పము
(పూజకు ముందుగా సంకల్పము చెప్పడము వలన మనసుకు సంసిద్ధత ఏర్పడును. సంకల్పము లో ముఖ్యంగా మనమున్న ప్రదేశం, ఆ ప్రదేశం లో ఉన్న కాల గణనం, మన వంశ, గోత్ర విశేషాలు వివరింపబడతాయి)

మామో పాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముధిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే శోభనే మంగళ ముహూర్తే, శ్రీ మహా విష్ణో  రాజ్ఞయా ప్రవర్త మానస్య, అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్దే, శ్వేత వరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరో: ఆగ్నేయ దిగ్భాగే, చతుస్సాగర మధ్యే, సింహపురి నగరే, అస్మిన్ గృహే (స్వగృహే /వసతి గృహే), సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్ర మానేన, …. నామ సంవత్సరే, …. (ఉత్తర/దక్షిణ) ఆయనే , …. ఋతౌ, ….  మాసే, … (శుక్ల/కృష్ణ) పక్షే, తిథౌ, వాసరే, శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరణ, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ

శ్రీమాన్ శ్రీమత గోత్రోద్భవ .. గోత్ర … నామధేయ

(గమనిక: పురోహితుడు సంకల్పం చెప్పినప్పుడు గోత్రస్య అని నామధేయస్య అని చెప్పడం జరుగుతుంది. ఎవరికీ వారే సంకల్పం చెప్పినప్పుడు పై విధంగా చెప్పాలి. స్త్రీలు గోత్రోద్భవతీ, నామ్నీ అని చెప్పాలి)

మమ ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం,  ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్ధం, సర్వాపదాం నివారణార్ధం, సకలకార్య విఘ్న నివారణార్ధం, సత్సంతాన సిద్ధ్యర్ధం,, ఇష్ట దేవతా ప్రీత్యర్థం శ్రీ సూక్త, పురుష సూక్త విధానేన యధాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే ॥

అని చెప్పి అనామిక తో (ఉంగరం వేలితో ) జలమును స్పృశించాలి లేదా ఉద్ధరిణి తో నీళ్ళు తీసుకుని పళ్ళెములో విడువ వలెను


(గమనిక: ఇష్ట దేవతా పూజాం అనే చోట మనం పూజ చేయబోవు దేవత పేరు చెప్పుకోవాలి - సాధారణంగా ఆది వారం - శ్రీ సూర్య నారాయణ మూర్తి, సోమ వారం - శ్రీ శివ, మంగళ వారం - శ్రీ ఆంజనేయ స్వామి, బుధ వారం - శ్రీ విష్ణు, గురు వారం - శ్రీ దత్తాత్రేయ/షిర్డీ సాయి బాబా, శుక్ర వారం - శ్రీ అష్ట లక్ష్మి/శ్రీ గౌరీ దేవి, శని వారం - శ్రీ వేంకటెశ్వర స్వామి)

ఆయనము
ఒక సంవత్సరమును రెండు ఆయనములుగ విభజిస్తారు. మకర సంక్రాంతి నుండి ఆరు మాసములు “ఉత్తరాయణము” - కర్కాటక సంక్రమణం తర్వాత ఆరు మాసములు “దక్షిణాయనము” గా లెక్కింపబడును

మాసములు - ఋతువులు
చైత్రము, వైశాఖము - వసంత ఋతువు
జ్యేష్టం, ఆషాడము - గ్రీష్మ ఋతువు
శ్రావణము, భాద్రపదము - వర్ష ఋతువు
ఆశ్వజము, కార్తీకము - శరదృతువు
మార్గశిరము, పుష్యము - హేమంత ఋతువు
మాఘము, ఫాల్గుణము - శిశిర ఋతువు

తిథులు
పక్షానికి 15 రోజులు. వాటినే తిథులు అంటాము. ఇవి సంఖ్యా వాచకాలు.
  1. పాడ్యమి 2. విదియ 3. తదియ 4. చవితి 5. పంచమి 6. షష్ఠి 7. సప్తమి 8. అష్టమి 9. నవమి 10. దశమి 11. ఏకాదశి 12. ద్వాదశి 13. త్రయోదశి 14. చతుర్దశి 15. పౌర్ణమి / అమావాస్య (బహుళ పక్షం చివరి రోజు అమావాస్య)

సంకల్పం లో తిథి చెప్పునప్పుడు తిథి పేరు చివర “యామ్” చేర్చి చెప్పాలి ఉదా: పంచమి - పంచమ్యామ్.., చతుర్దశి - చతుర్దశ్యాం

పక్షములు
ఒక నెలలో 30 దినములను రెండు పక్షములుగా విభజిస్తాము. చంద్రునికి వృద్ది కలిగే పక్షము శుక్ల/శుద్ధ పక్షము - చంద్రునికి క్షయ కలిగే పక్షము కృష్ణ/బహుళ పక్షము

వారములకు సంస్కృత పదాలు
ఆది వారము - భాను వాసరే
సోమ వారము - ఇందు వాసరే
మంగళ వారము - భౌమ వాసరే
బుధ వారము - సౌమ్య వాసరే
గురు వారము - గురు వాసరే
శుక్ర వారము - భ్రుగు వాసరే
శని వాసరే - స్థిర వాసరే


కలశారాధనము
(కలశము సంపూర్ణత్వానికి చిహ్నము. పూజారంభమున పాత్రను తీసుకొని దాని చుట్టూ పసుపు రాసి కుంకుమ తో బొట్లు పెట్టి, పవిత్రమైన నీటిని పోసి దానిలో గంధము, పూలు, అక్షతలు వేసి కుడి చేతితో కలశమును మూసి యుంచి మంత్రములు చెప్పవలెను)

తదంగ కలశారాధనం కరిష్యే ॥
శ్లో || కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

ఆపోవా ఇదగమ్ సర్వం విశ్వాభూతాన్యాపః
ప్రాణావా ఆపః పశవః  ఆపో న్నమాపో అమృతమాప
స్సమ్రాడాపో విరాడాప స్స్వరాడాపశ్చందాగ్o ష్యాపో జ్యోతిగ్o  ష్యాపో
యజుగ్o ష్యాప స్సత్యమాప స్సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాపః ఓం

శ్లో || గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
కావేరి తుంగభద్రాచ కృషవేణి చ గౌతమి
భాగీరథీతి విఖ్యాతః పంచ గంగాః ప్రకీర్తితాః
(కలశము లోని ఉదకమును ప్రముఖ జీవనదుల లోని జలములుగా భావించి పూవుతో ఆ నీటిని పూజా ద్రవ్యముల మీద, దేవతా విగ్రహముల మీద, మన (తన) మీద జల్లుకొనవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః - ధ్యానం
శ్లో॥ ధ్యాయేత్ గజాననం దేవం తప్త కాంచన సుప్రభమ్
చతుర్భాహుం మహాకాయమ్ కోటి సూర్య సమప్రభమ్ ॥
శ్రీ మహాగణాధిపతయే నమః - ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయో పాద్యం, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనం సమర్పయామి, స్నానం సమర్పయామి, వస్త్ర యుగ్మం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, శ్రీ గంధం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, పుష్పై పూజయామి

ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః,
ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః,
ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః,
ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః,
ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః,
ఓం ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,
ఓం మహాగణాదిపతియే నమః  

నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి

ధూప మాఘ్రా పయామి, దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి
తాంబూలం సమర్పయామి, నీరాజనం సమర్పయామి

వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా
నిర్విఘ్నం కురుమే దేవా, సర్వ కార్యేషు సర్వదా ॥

శ్రీ మహా గణపతయే నమః ॥ ధ్యాన ఆవహనాది షోడశోపచార పూజాం సమర్పయామి ॥

(ఇక్కడ ఇష్ట దేవతను పరమ శివుడి గా భావించడం జరిగింది)

ఓం శ్రీ ఉమా మహేశ్వర స్వామినే నమః
ధ్యానం
శ్లో॥ వందే శంభు ముమాపతిం సురగురుం, వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం, మృగధరం వందే పశూనాం పతిం
వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియమ్
వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరమ్

శ్రీ ఉమా మహేశ్వర స్వామినే నమః - ధ్యాయామి
(అక్షతలు దేవుడి దగ్గర ఉంచవలెను)
ఆవాహనం
హస్ర’శీర్షా పురు’షః | సహస్రాక్షః హస్ర’పాత్ |
స భూమిం’ విశ్వతో’ వృత్వా | అత్య’తిష్ఠద్దశాంగుళమ్ ||

ఓం || హిర’ణ్యవర్ణాం హరి’ణీం సువర్ణ’రతస్ర’జామ్ |
ంద్రాం హిరణ్మ’యీం క్ష్మీం జాత’వేదో ఆవ’హ ||

శ్రీ ఉమా మహేశ్వర స్వామినే నమః - ఆవాహయామి
(అక్షతలు దేవుడి దగ్గర ఉంచవలెను)

ఆసనం
పురు’ష వేదగ్‍మ్ సర్వమ్” | యద్భూతం యచ్చ భవ్యమ్” |
తామృ’త్వ స్యేశా’నః | దన్నే’నాతిరోహ’తి ||

తాం ఆవ’ జాత’వేదో క్ష్మీమన’పగామినీ”మ్ |
స్యాం హిర’ణ్యం విందేయం గామశ్వం పురు’షాహమ్ ||

శ్రీ ఉమా మహేశ్వర స్వామినే నమః - సువర్ణ రత్న ఖచిత సింహాసనం సమర్పయామి
(దేవుడిని ఉంచిన పీఠం పైన అక్షతలు ఉంచవలెను)

పాద్యం
తావా’నస్య మహిమా | అతో జ్యాయాగ్’‍శ్చ పూరు’షః |
పాదో”‌உస్య విశ్వా’ భూతాని’ | త్రిపాద’స్యామృతం’ దివి ||

అశ్వపూర్వాం ర’థధ్యాం స్తినా”ద-ప్రబోధి’నీమ్ |
శ్రియం’ దేవీముప’హ్వయే శ్రీర్మా దేవీర్జు’షతామ్ ||

శ్రీ ఉమా మహేశ్వర స్వామినే నమః - పాదయో: పాద్యం సమర్పయామి
(దేవుడి పాదాలకు నీళ్ళు ఇస్తున్నట్టుగా భావించి కలశం లోని నీళ్ళు దేవుడికి చూపించి పళ్ళెం లో వదలవలెను)

అర్ఘ్యం
త్రిపాదూర్ధ్వ ఉదైత్పురు’షః | పాదో”‌உస్యేహా‌உ‌உభ’వాత్పునః’ |
తో విష్వణ్-వ్య’క్రామత్ | సాశనానశనే భి ||

కాం సో”స్మితాం హిర’ణ్యప్రాకారా’మార్ద్రాం జ్వలం’తీం తృప్తాం ర్పయం’తీమ్ |
పద్మే స్థితాం ద్మవ’ర్ణాం తామిహోప’హ్వయే శ్రియమ్ ||

శ్రీ ఉమా మహేశ్వర స్వామినే నమః - హస్తయో: అర్ఘ్యం సమర్పయామి
(దేవుడి చేతులకు నీళ్ళు ఇస్తున్నట్టుగా భావించి కలశం లోని నీళ్ళు దేవుడికి చూపించి పళ్ళెం లో వదలవలెను)

ఆచమనం
తస్మా”ద్విరాడ’జాయత | విరాజోధి పూరు’షః |
జాతో అత్య’రిచ్యత | శ్చాద్-భూమిమథో’ పురః ||

ంద్రాం ప్ర’భాసాం సా జ్వలం’తీం శ్రియం’ లోకే దేవజు’ష్టాముదారామ్ |
తాం ద్మినీ’మీం శర’ణహం ప్రప’ద్యే‌உలక్ష్మీర్మే’ నశ్యతాం త్వాం వృ’ణే ||

శ్రీ ఉమా మహేశ్వర స్వామినే నమః - ముఖే ఆచమనీయం సమర్పయామి
(కలశం లోని నీళ్ళు దేవుడికి చూపించి పళ్ళెం లో వదలవలెను - 3 సార్లు చేయవలెను)


పంచామృత స్నానమ్
పాలు: ఓం ఆప్యాయస్వ సమేతు తే  విశ్వతః సోమ వృష్ణియం ।  భవా వాజస్య సంగధే । ।  
ఇతి క్షీరేరస్నపయామి । ।

పెరుగు :ఓం దధిక్రావ్ణో  అకారిషం జిష్ణోరశ్వస్య వాజినః
సురభినో ముఖాకరత్ప్రణ ఆయుగ్o షి తారిషత్ । ।
ఇతి ధధ్నా స్నపయామి । ।

నెయ్యి: ఓం శుక్రమసి జ్యోతిరసి తేజో సి దేవో వః సవితోత్పునా ।
త్వచ్చిద్రేణ పవిత్రేణ సూర్యస్మ రశ్మిభి: । ।
ఇతి ఆజ్యేన స్నపయామి । ।

తేనె: ఓం మధువాతా ఋతాయతే మధుక్షరంతి సింధవః  ।  మాధ్వీర్నస్సంత్వోషధీ:
మధు నక్త ముతోషసి మధుమత్సార్థివగ్o రజః ।  మధు ద్యౌ రస్తు నః పితా ।
మధుమాం నో వనస్పతిర్మధుమాగ్o అస్తు సూర్యః ।  మాధ్వీర్గావో భవంతు నః । ।
ఇతి మధునా స్నపయామి । ।

శక్కర: ఓం స్వాధు: పవస్య దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహావేతునామ్నే ।
స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగ్o అదాభ్యః । ।
ఇతి శర్కరేణ స్నపయామి । ।

పంచామృత స్నానానంతరం శుధ్దోదక స్నానం  సమర్పయామి

శుధ్దోదక స్నానం
(ఈ క్రింది మంత్రములు చెప్తూ కలశం లోని నీళ్ళతో దేవుడి ప్రతిమ కు స్నానం చేయించవలెను)
(ఇక్కడ పురుష సూక్తం లేదా శ్రీ సూక్తం పఠించవచ్చు)
యత్పురు’షేణ విషా” | దేవా ఙ్ఞమత’న్వత |
వసంతో అ’స్యాసీదాజ్యమ్” | గ్రీష్మ ధ్మశ్శధ్ధవిః ||

ఆదిత్యవ’ర్ణే తసో‌உధి’జాతో వస్పతిస్తవ’ వృక్షో‌உథ బిల్వః |
స్య ఫలా’నిసాను’దంతు మాయాంత’రాయాశ్చ’ బాహ్యా అ’క్ష్మీః ||

ఓం ఆపోహిష్ట మయో భువ తాన ఊర్జే దధాతన
మహేరణాయ చక్షసే యోవశ్శివ తమో రస
తస్య భాజయ తేహన ఉశతీరవ మాతర
తస్మా అరంగ మామవ యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయ దాచనః
శుధ్దోదక స్నానం  సమర్పయామి



వస్త్రమ్
(ఈ క్రింది మంత్రం చెప్తూ దూది తో చేసిన వస్త్రమును లేదా అక్షతలు కాని ఉంచవలెను)
ప్తాస్యా’సన్-పరిధయః’ | త్రిః ప్త మిధః’ కృతాః |
దేవా యద్యఙ్ఞం త’న్వానాః | అబ’ధ్నన్-పురు’షం శుమ్ ||

ఉపైతు మాం దేఖః కీర్తిశ్చ మణి’నా హ |
ప్రాదుర్భూతో‌உస్మి’ రాష్ట్రే‌உస్మిన్ కీర్తిమృ’ద్ధిం దాదు’ మే ||

శ్రీ ఉమా మహేశ్వర స్వామినే నమః - వస్త్రయుగ్మం సమర్పయామి
(ఒకవేళ  అక్షతలు ఉంచినట్టయితే వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి అని చదువవలెను)

వస్త్రాంతే ఆచమనీయం సమర్పయామి
(కలశం లోని నీళ్ళు దేవుడికి చూపించి పళ్ళెం లో వదలవలెను)

యజ్ఞోపవీతమ్
(ఈ క్రింది మంత్రం చెప్తూ దూది తో చేసిన యజ్ఞోపవీతము లేదా అక్షతలు కాని ఉంచవలెను)
తం ఙ్ఞం బర్హిషి ప్రౌక్షన్’ | పురు’షం జాతమ’గ్రతః |
తేన’ దేవా అయ’జంత | సాధ్యా ఋష’యశ్చ యే ||

క్షుత్పి’పాసామ’లాం జ్యేష్ఠామ’క్షీం నా’శయామ్యహమ్ |
అభూ’తిమస’మృద్ధిం చ సర్వాం నిర్ణు’ద మే గృహాత్ ||

శ్రీ ఉమా మహేశ్వర స్వామినే నమః - యజ్ఞోపవీతమ్ సమర్పయామి
(ఒకవేళ  అక్షతలు ఉంచినట్టయితే వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి అని చదువవలెను)

అనంతరం ఆచమనీయం సమర్పయామి
(కలశం లోని నీళ్ళు దేవుడికి చూపించి పళ్ళెం లో వదలవలెను)

గంధమ్
(ఈ క్రింది మంత్రం చెప్తూ పుష్పానికి చందనం అద్ది దేవుడి దగ్గర ఉంచవలెను)
తస్మా”ద్యఙ్ఞాత్-స’ర్వహుతః’ | సంభృ’తం పృషదాజ్యమ్ |
శూగ్-స్తాగ్‍శ్చ’క్రే వావ్యాన్’ | ఆరణ్యాన్-గ్రామ్యాశ్చ యే ||

ధద్వారాం దు’రాధర్షాం నిత్యపు’ష్టాం కరీషిణీ”మ్ |
శ్వరీగ్‍మ్’ సర్వ’భూతానాం తామిహోప’హ్వయే శ్రియమ్ ||

శ్రీ ఉమా మహేశ్వర స్వామినే నమః - శ్రీ గంధ విలేపనం సమర్పయామి

అక్షతాన్
(ఈ క్రింది మంత్రం చెప్తూ అక్షతలు దేవుడి దగ్గర ఉంచవలెను)
తస్మా”ద్యఙ్ఞాత్స’ర్వహుతః’ | ఋచః సామా’ని జఙ్ఞిరే |
ఛందాగ్‍మ్’సి జఙ్ఞిరే తస్మా”త్ | యజుస్తస్మా’దజాయత ||

మన’సః కామాకూతిం వాచః త్యమ’శీమహి |
పశూనాం రూపమన్య’స్య మయి శ్రీః శ్ర’యతాం యశః’ ||

శ్రీ ఉమా మహేశ్వర స్వామినే నమః - అలంకరణార్తం అక్షతాన్ సమర్పయామి

హరిద్రా చూర్ణమ్
(ఈ క్రింది మంత్రం చెప్తూ పసుపు దేవుడి దగ్గర ఉంచవలెను)
ఓం హరిరివ భోగై: పర్యేతి బాహుం జ్యాయా
హేతిం పరిబాధ మానః హస్తఘ్నో విశ్వావయునాని విద్వాన్ ।
పుమాన్ పుమాం సం పరి పాతు విశ్వతః ॥
శ్రీ ఉమా మహేశ్వర స్వామినే నమః - హరిద్రా విలేపనం సమర్పయామి

కుంకుమ చూర్ణమ్
(ఈ క్రింది మంత్రం చెప్తూ కుంకుమ దేవుడి దగ్గర ఉంచవలెను)
ఓం సుమంగలీరియం వధూ రిమాం సమేత పశ్యత ।
సౌభాగ్య మస్త్యయ్ దత్వా యాధాస్తం విపరేతన ॥
శ్రీ ఉమా మహేశ్వర స్వామినే నమః - కుంకుమ విలేపనం సమర్పయామి ॥

పుష్పమ్
స్మాదశ్వా’ అజాయంత | యే కే చో’యాద’తః |
గావో’ హ జఙ్ఞిరే తస్మా”త్ | తస్మా”జ్జాతా అ’జావయః’

ర్దమే’న ప్ర’జాభూతా మయి సంభ’వ ర్దమ |
శ్రియం’ వాసయ’ మే కులే మాతరం’ పద్మమాలి’నీమ్ ||

శ్రీ ఉమా మహేశ్వర స్వామినే నమః - పుష్పం సమర్పయామి ॥

ఇక్కడ అష్టోత్తర శత నామావళి పఠిస్తూ పుష్పార్చన చేయవలెను

ధూపమ్
(ఈ క్రింది మంత్రం చెప్తూ ధూపం చూపించవలెను)
యత్పురు’షం వ్య’దధుః | కతిథా వ్య’కల్పయన్ |
ముఖం కిమ’స్య కౌ బాహూ | కావూరూ పాదా’వుచ్యేతే ||

ఆపః’ సృజంతు’ స్నిగ్దాని చిక్లీత వ’స మే గృహే |
ని చ’ దేవీం మారం శ్రియం’ వాసయ’ మే కులే ||

శ్రీ ఉమా మహేశ్వర స్వామినే నమః - దూపమాఘ్రా పయామి  ॥

దీపమ్
(ఈ క్రింది మంత్రం చెప్తూ దీపము వద్ద అక్షతలు ఉంచి నమస్కరించాలి)
బ్రాహ్మణో”‌உస్య ముఖ’మాసీత్ | బాహూ రా’న్యః’ కృతః |
రూ తద’స్య యద్వైశ్యః’ | ద్భ్యాగ్‍మ్ శూద్రో అ’జాయతః ||

ర్ద్రాం పుష్కరి’ణీం పుష్టిం సువర్ణామ్ హే’మమాలినీమ్ |
సూర్యాం హిరణ్మ’యీం క్ష్మీం జాత’వేదో ఆవ’హ ||

శ్రీ ఉమా మహేశ్వర స్వామినే నమః - దీపం దర్శయామి ॥


నైవేద్యం
ంద్రమా మన’సో జాతః | చక్షోః సూర్యో’ అజాయత |
ముఖాదింద్ర’శ్చాగ్నిశ్చ’ | ప్రాణాద్వాయుర’జాయత ||

ర్ద్రాం యః కరి’ణీం ష్టిం పిలామ్ ప’ద్మమాలినీమ్ |
ంద్రాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో ఆవ’హ ||

ప్రసాదం పై పూవు తో నీళ్ళు చల్లి -
ఓం భూర్భువస్సువః ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియోయోన ప్రచోదయాత్ । ।  
అని చదివి నైవేద్యమును నివేదిస్తూ

సత్యంత్వర్తేన పరిషించామి
అమృతమస్తు
అని చెప్పి ఉద్ధరిణి తో నీరు దైవానికి చూపి పళ్ళెములో వేయవలెను

అమృతోపస్తరణ మసి
మనం పెట్టే నైవేద్యాన్ని చెప్పాలి. నైవేద్యములు నివేదిస్తూ
శ్రీ భవాని శంకర స్వామి నే నమః
ఓం ప్రాణాయ స్వాహా
ఓం అపానాయ స్వాహా
ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా
ఓం సమానాయ స్వాహా
అంటూ పూవు తో నీళ్ళు చల్లాలి

శ్రీ ఉమా మహేశ్వర స్వామినే నమః - నైవేద్యం సమర్పయామి ॥
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి
ఉత్తరాపోశనం సమర్పయామి, హస్తౌ ప్రక్ష్యాళయామి, పాదౌ ప్రక్ష్యాళయామి, ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి

తాంబూలం
(ఈ క్రింది మంత్రం చెప్తూ తమలపాకులు, ఫలం, వక్క మరియు నాణెం ఉంచాలి లేదా అక్షతలు ఉంచి “తాంబూలార్థం అక్షతాన్ సమర్పయామి” అని చెప్పవలెను)
నాభ్యా’ ఆసీంతరి’క్షమ్ | శీర్ష్ణో ద్యౌః సమ’వర్తత |
ద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రా”త్ | తథా’ లోకాగ్మ్ అక’ల్పయన్ ||

తాం ఆవ’ జాత’వేదో క్షీమన’పగామినీ”మ్ |
స్యాం హిర’ణ్యం ప్రభూ’తం గావో’ దాస్యో‌உశ్వా”న్, విందేయం పురు’షాహమ్ ||

శ్రీ ఉమా మహేశ్వర స్వామినే నమః - తాంబూలం సమర్పయామి ॥

నీరాజనం
(ఈ క్రింది మంత్రం చెప్తూ కర్పూర హారతి వెలిగించాలి)
వేదాహమే’తం పురు’షం హాంతమ్” | ఆదిత్యవ’ర్ణం తమ’స్తు పారే |
సర్వా’ణి రూపాణి’ విచిత్య ధీరః’ | నామా’ని కృత్వా‌உభిదన్, యదా‌உ‌உస్తే” ||

ఓం మహాదేవ్యై చ’ విద్మహే’ విష్ణుత్నీ చ’ ధీమహి | తన్నో’ లక్ష్మీః ప్రచోదయా”త్ ||

శ్రీ ఉమా మహేశ్వర స్వామినే నమః - నీరాజనం సమర్పయామి ॥
నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి ॥

మంత్రపుష్పమ్
ఓం రాజాధిరాజాయ’ ప్రహ్య సాహినే” | నమో’ యం వై”శ్రణాయ’ కుర్మహే | స మే కామాన్ కా కామా’మహ్యమ్” | కామేశ్వరో వై”శ్రణో ద’దాతు | కుబేరాయ’ వైశ్రణాయ’ | మహారాజా నమః’ |

శ్రీ ఉమా మహేశ్వర స్వామినే నమః - మంత్ర పుష్పాంజలిమ్ సమర్పయామి ॥
(అని అక్షతలు,పూలు దేవుడి దగ్గర ఉంచాలి )

ప్రదక్షిణ నమస్కారం
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రణస్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాప కర్మాణం పాపాత్మం పాప సంభవః
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సలా
అన్యధా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర । ।

ఇతి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ॥

సాష్టాంగ నమస్కారం
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా ।
పదాభ్యం కరాభ్యం జనుభ్యం ప్రణామోస్తాంగ ముచ్యతే ॥

పునః పూజ
శ్రీ భవాని శంకర స్వామినే నమః - ఇతి పునః పూజాంచ కరిష్యే ॥

ఛత్రం ఆచ్చాదయామి , చామరం వీచయామి , నృత్యం దర్శయామి
గీతం శ్రావ్యయామి, ఆందోళికా మారోహయామి, అశ్ర్వానారోహయామి
గజానారోహయామి, సమస్త రాజోపచార, శక్త్యుపచార, భక్త్యుపచార పూజాం సమర్పయామి
(అక్షతలు వేయవలెను)

పూజ సమర్పణమ్
శ్లో। । మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సదాశివ ।
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తు తే  ॥

అనయా ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవతా సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు ॥
(చేతిలో అక్షతలు నీరు వేసుకుని పళ్ళెములో విడువ వలెను)

అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా ।
తాని సర్వాణి మే దేవ క్షమస్వ పురుషోత్తమా ॥

మధ్యే మంత్ర తంత్ర స్వరవర్ణ ధ్యాననియమ న్యూనాతిరిక్త లోపదోష
ప్రాయశ్చిత్తార్థం అచ్యుత అనంత గోవింద మహామంత్ర జపం కరిష్యే । ।

అచ్యుతాయ నమః  ।
అనంతాయ నమః  ।
గోవిందాయ నమః ।

॥  సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు ॥

5 comments:

  1. చాలా బాగుంది.

    ReplyDelete
  2. చాలా చాలా బాగుంది.

    ReplyDelete
  3. జై శ్రీరామ్ జై బజరంగ్ బలి, Chala bagundi puja vidanam

    ReplyDelete
  4. బాగా వివరించారు
    ధన్యవాదాలు

    ReplyDelete